
ఢిల్లీ, 10 జూన్ (హి.స.)మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ, తన నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ తొలిసారి స్పందించారు.. తన నామినేషన్ రద్దు నిర్ణయం బీజేపీ అసలు ఉద్దేశాలు, విధానాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపినప్పుడే వారి రాజకీయ వ్యూహం స్పష్టమైందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
‘ఒకే పార్టీ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం’
బీజేపీ తమ అభ్యర్థిని ఎమ్మెల్యే కాకపోయినా బరిలోకి దింపిందని, అప్పుడే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే రాజకీయాలు జరుగుతున్నాయని అర్థమైందని మీనాక్షి పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా బీజేపీ విధానాలు బహిర్గతమయ్యాయని, ఇప్పుడు ప్రశ్న ప్రజాస్వామ్యం గెలుస్తుందా లేదా అన్నదేనని వ్యాఖ్యానించారు. “ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు లేదా ఒక అభ్యర్థి గురించి మాత్రమే కాదు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు, భారత సమాఖ్య వ్యవస్థ, దేశ ఆలోచన (‘ఐడియా ఆఫ్ ఇండియా’) కోసం జరుగుతున్న పెద్ద పోరాటంలో భాగం. ఒకే పార్టీ పాలన, నియంతృత్వ ధోరణులను తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది” అని ఆమె ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు