
న్యూఢిల్లీ, 14 జూన్ (హి.స.)
ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున
భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కల్కాజీ గోవిందప్పురి ఫ్లై ఓవర్ సమీపంలోని జారా బాంక్వెట్ రెస్టారెంట్ లో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరుఫైర్ ఇంజిన్ లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అదే ఆ మంటలు పక్క భవనాలకు సైతం వ్యాప్తి చెందగా భవనంలో చాలా మంది ఉన్నారు. కానీ అప్పటికే అగ్నిమాపక సిబ్బంది వారిని అప్రమత్తం చేసి కిందకు పంపించారు. పక్క భవనంలో ఓ వృద్ధురాలు సైతం చిక్కుకుపోగా ఆమెను సిబ్బంది రక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు