ఇజ్రాయెల్కు మోదీ సర్కార్ బ్లైండ్ సపోర్ట్- విదేశాంగ విధానంలో సమతుల్యత అవసరం: కాంగ్రెస్
ఇజ్రాయెల్కు మోదీ సర్కార్ బ్లైండ్ సపోర్ట్- విదేశాంగ విధానంలో సమతుల్యత అవసరం: కాంగ్రెస్
ఇజ్రాయెల్కు మోదీ సర్కార్ బ్లైండ్ సపోర్ట్- విదేశాంగ విధానంలో సమతుల్యత అవసరం: కాంగ్రెస్


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఈ పరిణామం భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక, విదేశాంగ సవాళ్లకు పూర్తి పరిష్కారం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు.

జూన్ 19న జెనీవాలో ఒక ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం సానుకూల పరిణామని జైరాం రమేశ్ అన్నారు. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడకపోయినా, ఈ చర్య ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని అమెరికా, ఇరాన్ మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ కూడా గౌరవిస్తే పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాత్కాలిక ఒప్పందంగా ప్రారంభమైనా, భవిష్యత్తులో శాశ్వత శాంతి, సాధారణ సంబంధాల పునరుద్ధరణకు ఇది మార్గం సుగమం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఆకాంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande