
అహ్మదాబాద్, 15 జూన్ (హి.స.)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు తుది దశలో ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ దర్యాప్తు విధానాలను (ప్రోటోకాల్లను) కచ్చితంగా పాటిస్తూ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) త్వరలోనే తన తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ తుది నివేదిక కోసం తామంతా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi