హ్యుమానిటీస్ కోర్సులకు సీయూఈటీ పరీక్షా విధానం సరికాదు, మార్పులు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు

హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) ప్రస్తుత విధానంపై దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (MCQ) విధానం స్వతంత్ర, సృజనాత్మక ఆలోచనలకు తావిచ్చే హ్యుమానిటీస్ (ఆర్ట్స్), సోషల్ సైన్సెస్ కోర్సుల ప్రవేశాలకు ఏమాత్రం సరిపోదని ప్యానెల్ స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలకు అనుగుణంగా, క్వశ్చన్ పేపర్ల నాణ్యతతో పాటు సీయూఈటీ పరీక్షా సరళిని (ఎగ్జామ్ డిజైన్) పూర్తిగా పునఃసమీక్షించాలని కేంద్ర విద్యా శాఖను కమిటీ కోరింది. కేవలం ఒకే ఒక ప్రవేశ పరీక్షగా సీయూఈటీని ఉంచడం వల్ల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తమ ప్రత్యేక చట్టపరమైన నిబంధనల ప్రకారం ప్రాంతీయ, సామాజిక-ఆర్థిక వైవిధ్యాన్ని కాపాడుకుంటూ అడ్మిషన్లు చేపట్టే వీలు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లకు ప్రభుత్వం సూచించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande