పినరయి విజయన్ కూతురుకు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు
పినరయి విజయన్ కూతురుకు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు
E d


కోచి, 21 జూన్ (హి.స.)

కేరళ మాజీ సీఎం పినరయి

విజయనకు ఈడీ షాకిచ్చింది. ఆయన కూతురు టీ వీణాకు మనీ లాండరింగ్ కేసులో సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ అనే మైనింగ్ కంపెనీతోపాటు ఆమె ఐటీ కంపెనీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29న వీణా తమ ఎదుగ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది.

ఈ నెల 17న ఆమెను కోచిలోని ఈడీ ఆఫీసులో అధికారులు విచారించారు. దాదాపు తొమ్మిది గంటలకుపైగా ఆమెను విచారించారు. ఆమెపై పీఎంఎల్డీ యాక్ట్ కింద నమోదైన కేసుపై ఈ విచారణ సాగుతోంది. జూన్ 19న ఈడీ అధికారులు తిరువనంతపురంలోని ఆమె బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన విచారణలో ఆమె ఇచ్చిన వాంగ్మూలం, బ్యాంకు లాకర్ల తనిఖీల తర్వాత మరింత విచారణ అవసరమని ఈడీ అధికారులు భావించారు. అందుకే ఆమెకు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ నెల 29న మరోసారి తమ ఎదుట హాజరు కావాలని వీణకు సూచించారు. ఈ కేసులో మరో నలుగురికి కూడా అధికారులు ఇప్పటివరకు విచారించారు.

సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి వీణకు చెందిన ఐటీ సంస్థకు రూ.2.87 కోట్లు బదిలీ అయ్యాయని ఈడీ గుర్తించింది. ఏ సేవలు అందించకుండానే వీణ సంస్థకు చెల్లింపులు జరిగాయి. అలాగే, ఇతర లోన్లకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో వీటిని ఈడీ విచారిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande