అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన
అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన
Seoni: On August 21, a special train will leave from Seoni railway station for Ayodhya Dham


అయోధ్య , 21 జూన్ (హి.స.)

అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రతిపాదన చేశారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో అయోధ్యలో కూడా వృత్తిపరమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

విరాళాలు, హుండీ కానుకల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని, ఇవి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని నృపేంద్ర మిశ్రా అన్నారు. ఈ నేపథ్యంలో, ఆలయ ట్రస్టు విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన నృపేంద్ర మిశ్రా, ఆలయ నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లో పనిచేసిన అనుభవం ఉన్న ఒక స్వతంత్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించాలని, ఉన్నతస్థాయిలో సిబ్బంది నియామకాలను క్రమబద్ధీకరించాలని సూచించారు. టీటీడీలో కమిషనర్ స్థాయి అధికారి సుదీర్ఘకాలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించే విధానాన్ని ఆయన ఉదహరించారు. టీటీడీ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కాకుండా, దాని పాలనా సూత్రాలను అనుసరించడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చని వివరించారు.

ప్రస్తుతం సిట్ అధికారులు ఆలయ ఆర్థిక రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ వివాదాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. సిట్ దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని, భక్తులు ఆందోళన చెందవద్దని కోరారు. కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిపుణులతో కూడిన నిర్వహణ ఎంతో అవసరమని నృపేంద్ర మిశ్రా అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande