శివసేన (యుబిటి)లో తిరుగుబాటు ప్రకంపనలు, ఎంపీలందరికీ పార్టీ విప్ జారీ
శివసేన (యుబిటి)లో తిరుగుబాటు ప్రకంపనలు, ఎంపీలందరికీ పార్టీ విప్ జారీ
shiv


ముంబై, 17 జూన్ (హి.స.)

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) వర్గానికి చెందిన లోక్సభ సభ్యులు తిరుగుబాటు చేసి, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికారిక శివసేన వర్గంలో చేరబోతున్నారనే ఊహాగానాల నడుమ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎంపీలందరూ వెంటనే ఢిల్లీలో జరిగే అత్యవసర సమావేశానికి హాజరుకావాలని శివసేన (యుబిటి) అధిష్టానం అధికారికంగా విప్ జారీ చేసింది. ఇటీవల ముంబైలోని మాతోశ్రీలో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన కీలక సమావేశానికి తొమ్మిది మంది లోక్సభ ఎంపీలలో ఐదుగురు ఎంపీలు స్వయంగా హాజరుకాకపోవడంతో ఈ తిరుగుబాటు వార్తలకు బలం చేకూరింది. దాదాపు 6 నుండి 7 మంది ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే కొందరు ఎంపీలు ఢిల్లీలో షిండే వర్గపు నేతలతో చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ చీలిపోకుండా నిరోధించేందుకు శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి తిరుగుబాటు వర్గానికి ప్రత్యేక గ్రూప్గా గుర్తింపు ఇవ్వరాదని ఆయన స్పీకర్ను కోరారు. మరోవైపు ఉద్ధవ్ వర్గపు అగ్రనేత సంజయ్ రౌత్ ఈ తిరుగుబాటు వార్తలను పూర్తిగా ఖండించారు, తమ ఎంపీలంతా ఐక్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande