నీట్ అభ్యర్థులకు బస్సు కిరాయిలో 50 శాతం రాయితీ ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
నీట్ అభ్యర్థులకు బస్సు కిరాయిలో 50 శాతం రాయితీ ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
yogi


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

ఉత్తరప్రదేశ్

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 21న జరగబోయే నీట్ (NEET-UG 2026) రీ-ఎగ్జామినేషన్కు హాజరయ్యే విద్యార్థుల కోసం

ఒక కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) బస్సుల్లో50

శాతం

ప్రయాణ ముఖ్యాంశాల రాయితీకల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు తమ

అధికారిక అడ్మిట్ కార్డ్ను చూపించి ఈ రాయితీని పొందవచ్చని స్పష్టం చేశారు. దీనితో

పాటు, ఇతర జిల్లాలకు ప్రయాణించే అభ్యర్థుల కోసం

అవసరమైన తాత్కాలిక వసతి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం

ఆదేశించారు .అదేవిధంగా, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాబోయే మొహర్రం పండుగ ఏర్పాట్లపై కూడా

ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతలకు

భంగం కలగకుండా మరియు ప్రజలకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు

కఠిన ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande