గుజరాత్లోని వడోదర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
గుజరాత్లోని వడోదర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
గుజరాత్లోని వడోదర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం


వడోదర, 17 జూన్ (హి.స.)

గుజరాత్లోని వడోదర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వెనుక నుండి అతివేగంగా ఢీకొట్టింది. వడోదర-హాలోల్ హైవేపై కోటంబి గ్రామం సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని పక్కన ఆపి టైర్ ప్రెజర్ను తనిఖీ చేస్తుండగా, రాజస్థాన్ నుండి గుజరాత్లోని సూరత్కు వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన 20 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో అత్యధికులు రాజస్థాన్కు చెందినవారేనని వడోదర జిల్లా ఎస్పీ సుశీల్ అగర్వాల్ తెలిపారు. స్థానిక జరోద్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.-------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande