
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, సరిహద్దు భద్రత, నేరస్తులపై సంయుక్త చర్యలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశం ఫ్రాన్స్‌లోని జీ 7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన మరుసటి రోజే జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం సెర్జియో గోర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘హోంమంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాలు, అక్రమ డ్రగ్స్ నుంచి ప్రజలను రక్షించడం, సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడం, రెండు దేశాల్లో నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో సహకారాన్ని మరింత పెంచే అంశాలపై ఫలవంతమైన చర్చ జరిగింది” అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు