విద్యార్థులకు ఎన్టీఏ మెసేజ్
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)నీట్‌-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (NTA) తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి.. పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ
neet


హైదరాబాద్, 18 జూన్ (హి.స.)నీట్‌-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (NTA) తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి.. పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రీటెస్టు ఉంటుందని.. పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను, సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా సందేశం విడుదల చేసింది. ఎన్‌టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది. మరోవైపు.. పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

‘‘అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మే 3నాటి పరీక్షను రద్దు చేశాం. ఈ వ్యవహారం నుంచి పాఠాలు నేర్చుకుని పరీక్షా ప్రక్రియను మరింత బలోపేతం చేశాం. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పటిష్ఠమైన, బహుళ అంచెల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ‘మానస్’ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ నంబర్‌ను (14416) సంప్రదించి సాయం కోరవచ్చు’’ అని ఎన్‌టీఏ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande