యూపీలో భారీ కుట్ర భగ్నం: పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఇద్దరి అరెస్ట్
యూపీలో భారీ కుట్ర భగ్నం: పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఇద్దరి అరెస్ట్
యూపీలో భారీ కుట్ర భగ్నం: పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఇద్దరి అరెస్ట్


బులంద్షహర్ , 19 జూన్ (హి.స.)యూపీలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ (ISI) నెట్వర్క్తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బులంద్షహర్ జిల్లాలో మహ్మద్ ఉమర్, ఫైజాన్ అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్లు షహజాద్ భట్టి, అబిద్ జత్ ల సూచనల మేరకు వీరు సోషల్ మీడియా ద్వారా స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేయడానికి మరియు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నట్లు యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యశ్ వెల్లడించారు.

నిందితులు ఆర్మీ కాంటోన్మెంట్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించడమే కాకుండా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు అబిద్ జత్ ఫోటోలతో కూడిన పోస్టర్లను వేర్వేరు చోట్ల అంటించాలని ప్లాన్ చేశారు. వీరి వద్ద నుంచి పోస్టర్ల వీడియోలు, కీలకమైన డిజిటల్ ఆధారాలను రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు చేపట్టి, తదుపరి విచారణను ముమ్మరం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande