వాట్సాప్లో ఈ నంబర్తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్లపై ఎన్టీఏ క్లారిటీ!
వాట్సాప్లో ఈ నంబర్తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్లపై ఎన్టీఏ క్లారిటీ!
NEET


హైదరాబాద్, 19 జూన్ (హి.స.)

నీట్ రీ-ఎగ్జామ్కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీయే) కీలక సూచనలు చేసింది. పరీక్షకు సంబంధించిన సమాచారం ఇకపై అధికారిక వాట్సాప్ ఖాతా ద్వారా కూడా అందజేస్తామని ప్రకటించింది. ఫేక్ మెసేజ్లు, నకిలీ ఈ-మెయిల్స్, మోసపూరిత లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్షా కేంద్రం వివరాలు, ఇతర ముఖ్యమైన అప్డేట్లు నేరుగా వాట్సాప్లో పంపనున్నట్లు తెలిపింది. ఎన్టీఏ పేరుతో వచ్చే ప్రతి మెసేజ్ను నమ్మవద్దని స్పష్టం చేసింది. అధికారిక వాట్సాప్ ఖాతాకు బ్లూ వెరిఫికేషన్ టిక్ ఉండటంతో పాటు ‘National Testing Agency’ అనే పేరు కనిపిస్తుందని తెలిపింది. వెరిఫైడ్ గుర్తు లేని ఖాతాల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని సూచించింది.

ఎన్టీఏ తెలిపిన ప్రకారం తమ అధికారిక వాట్సాప్ నంబర్ +91 78279 80287 మాత్రమే. ఈ ఖాతా ద్వారా సమాచారం మాత్రమే పంపుతామని, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఎప్పుడూ అడగబోమని వెల్లడించింది. మరోవైపు అడ్మిట్ కార్డుల డౌన్లోడ్కు సంబంధించిన రిమైండర్ మెసేజ్లు, ఇ-మెయిల్స్ కూడా పంపుతున్నట్లు తెలిపింది. అధికారిక ఎస్ఎంఎస్లు NICPEP పేరుతో మాత్రమే వస్తాయని పేర్కొంది. అలాగే అధికారిక ఈ-మెయిల్ ఐడీ no-reply.neet.nta@nic.in మాత్రమేనని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande