శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే


ముంబై20 జూన్ (హి.స.)

శివసేన (యూబీటీ)లో మరోసారి రాజకీయ సంక్షోభం ముదిరింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఆరుగురు లోక్సభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఆకస్మిక పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే కీలక ప్రకటన చేశారు. తన నాయకత్వంపై కార్యకర్తలకు నమ్మకం లేకపోతే, శివసేన (యూబీటీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.

ముంబైలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉద్ధవ్ మాట్లాడుతూ, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను పదవిని అంటిపెట్టుకుని ఉండాలని అనుకోవడం లేదు. ఒకవేళ నేను ఈ పదవికి అర్హుడిని కాదని మీరు భావిస్తే, తక్షణమే వైదొలుగుతాను. పార్టీ బాధ్యతలను ఎవరైనా చేపట్టవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఎంపీలు తిరుగుబాటుపై ఓటర్లకు క్షమాపణలు చెబుతూనే, బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు.

పార్టీకి ఉన్న తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు - సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నాయక్ నింబాల్కర్, సంజయ్ జాదవ్, భావ్సాహెబ్ - పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరంతా ఏక్నాథ్ షిండే వర్గంలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే మాత్రమే ఉద్ధవ్ వెంట నడుస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande