
అమృత్సర్, 04 జూన్ (హి.స.)
పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు (Bomb threat) ఈ-మెయిల్స్ (E-mails) వచ్చాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈ-మెయిల్స్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కాగా మరో రెండు రోజుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ (Operation Blue Star) కు 42 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం పంజాబీల్లో ఆందోళన కలిగిస్తోంది.బాంబు బెదిరింపు మెయిల్స్లో పేర్కొన్న ఆలయాల్లో అమృత్సర్లోని దుర్గియానా ఆలయం, పఠాన్కోట్లోని ముక్తేశ్వర్ ధామ్ ఆలయం, జలంధర్లోని దేవీ తలాబ్ మందిర్, భటిండాలోని మైసర్ ఖానా ఆలయం, పటియాలాలోని మాతాకాళీ ఆలయం ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఆపరేషన్ బ్లూస్టార్ కు 42 ఏళ్లు కావొస్తుండటంతో ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ బెదిరింపు మెయిల్తో భద్రతను మరింత పటిష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi