
ముంబై: , 04 జూన్ (హి.స.)
సుమారు 17 ఏళ్ల విరామం తర్వాత స్కాండినేవియన్ ఎయిర్లైన్స్కు చెందిన తొలి విమానం భారత్కు ప్రయాణమైంది. ముంబైలో వెల్కమ్ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ విమానం మధ్యలోనే యూ టర్న్ తీసుకుని వెనక్కి వెళ్లిపోయింది. (Scandinavian Airlines) జూన్ 2న స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ (ఎస్ఏఎస్)కు చెందిన ఎస్కే 969 ఫ్లైట్ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో తన కార్యకలాపాల విస్తరణ ఆశతో ఉన్న ఆ సంస్థ తొలి విమానం ముంబైకు ప్రయాణమైంది. ఆ విమానం తొలి ల్యాండింగ్ సందర్భంగా స్వాగతం పలికేందుకు ముంబై ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ సిబ్బంది వాటర్ కెనాన్ సెల్యూట్ కోసం సిద్ధమై వేచి ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi