తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ను ప్రారంభించిన మోదీ
తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ను ప్రారంభించిన మోదీ
Prime Minister Modi gave a message of nature and prosperity


అహ్మదాబాద్, 05 జూన్ (హి.స.)

తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒలింపిక్స్తో సహా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో యోగాసనానికి భవిష్యత్తులో చోటు దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రీడా వారసత్వంలో ఒక కొత్త అధ్యాయం చేరిందని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ యోగా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అహ్మదాబాద్ గడ్డ నుంచి ప్రపంచ క్రీడా వారసత్వంలో మరో కొత్త అధ్యాయం చేరింది. మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ప్రారంభమవుతోంది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అహ్మదాబాద్ ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ నగరం. ఇంతటి చారిత్రక నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం యావత్ దేశానికి ఎంతో గర్వకారణం. కొద్ది రోజుల్లోనే, జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో ప్రధాన కార్యక్రమం మరో చారిత్రక భారతీయ నగరమైన కోల్కతాలో జరగనుంది. ప్రపంచ యోగా దినోత్సవానికి కొద్ది రోజుల ముందే జరుగుతున్న ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. అని ప్రధాని మోదీ అన్నారు.

ఈ క్రమంలోనే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా'ను ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఒక ప్రభావవంతమైన మార్గాన్ని అందిస్తుందని అన్నారు. రోజూ యోగా చేయడం వల్ల అన్ని వ్యాధులు దూరమవుతాయని అభిప్రాయపడ్డారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ 'యోగా 365' ప్రచారాన్ని ప్రారంభించిందన్న ఆయన, అంతర్జాతీయంగా పాల్గొనేవారు యోగా సందేశాన్ని తమతో పాటు తిరిగి తీసుకువెళ్లాలని కోరారు. ఈ ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ దేశాలకు తిరిగి వెళ్లినప్పుడు, ఈ యోగా దేశాన్ని మీతో పాటు తీసుకువెళ్లండి. మీరందరూ మీ దేశాల్లో 'యోగా 365'కి రాయబారులుగా మారండి. మీ అనుభవాలు, యోగాపై మీకున్న విశ్వాసం ఈ సందేశంతో ప్రపంచం మొత్తాన్ని అనుసంధానిస్తాయి. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలిచినా చరిత్రలోని ఈ ముఖ్యమైన అధ్యాయంలో భాగం కావడం ద్వారా, మీరందరూ ఇప్పటికే ఛాంపియన్లుగా నిరూపించుకున్నారు. అని ప్రధాని మోదీ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande