
తిరువణ్ణామలై, 05 జూన్ (హి.స.)తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)లో దారుణాలు చోటుచేసుకున్నాయి. గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులపై ఒక ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణానికి పాల్పడిన ముఠాలోని 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకరు మైనర్ కూడా ఉన్నాడు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత గత నెల 30న తన స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణకు వచ్చింది. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వీరితో వచ్చిన వారు ముందు వెళ్లగా, పెద్ద కోలాపాడి వద్ద ఆమె, మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుకుంటుండగా, మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠా వారిని బెదిరించింది. తర్వాత వారిని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లింది. వివాహితపై ఆ దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi