సీఎం కుమార్తె కంపెనీ కేసు: ఈడీ దర్యాప్తుపై సీఎంఆర్ఎల్ అప్పీల్ను కొట్టివేసిన కేరళ హైకోర్టు
సీఎం కుమార్తె కంపెనీ కేసు: ఈడీ దర్యాప్తుపై సీఎంఆర్ఎల్ అప్పీల్ను కొట్టివేసిన కేరళ హైకోర్టు
సీఎం కుమార్తె కంపెనీ కేసు: ఈడీ దర్యాప్తుపై సీఎంఆర్ఎల్ అప్పీల్ను కొట్టివేసిన కేరళ హైకోర్టు


తిరువనంతపురం, 05 జూన్ (హి.స.)

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) దాఖలు చేసిన అప్పీల్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును అనుమతిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ను జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.ఈ కేసులో ఎటువంటి ముందస్తు ఎఫ్ఐఆర్ లేదా ఫిర్యాదు లేనప్పటికీ, ఈడీ నేరుగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేయడాన్ని సీఎంఆర్ఎల్ సంస్థ హైకోర్టులో సవాలు చేసింది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు ప్రారంభించడానికి ముందస్తు నివేదిక తప్పనిసరి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ కేవలం పత్రాల సమర్పణ, అధికారుల హాజరు కోసమే సమన్లు జారీ చేసినందున, ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది . సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలుగా తమకు రెండు వారాల పాటు స్టే ఇవ్వాలన్న సీఎంఆర్ఎల్ అభ్యర్థనను కూడా కోర్టు నిరాకరించింది ముఖ్యమంత్రి కుమార్తెకు చెందిన 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' అనే సాఫ్ట్వేర్ సంస్థకు, సీఎంఆర్ఎల్ కంపెనీ ఎలాంటి సేవలు పొందకుండానే ₹1.72 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. హైకోర్టు తాజా తీర్పుతో ఈ వివాదాస్పద కేసులో ఈడీ తన దర్యాప్తును మరింత వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది .

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande