రాహుల్ గాంధీ టార్గెట్గా దిల్లీలో పోస్టర్లు
రాహుల్ గాంధీ టార్గెట్గా దిల్లీలో పోస్టర్లు
BJP attacks Rahul Gandhi's statement that the government will fall within a year


దిల్లీ, 08 జూన్ (హి.స.)

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్న అజెండాతో విపక్ష ఇండియా కూటమి సోమవారం దిల్లీలో సమావేశం కానున్న వేళ కీలక పరిణామం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్న పోస్టర్లు దిల్లీలోని పలు కూడళ్లలో వెలిశాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ పోస్టర్లలో కనిపించాయి. కాగా, ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు వస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande