కర్ణాటక రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
కర్ణాటక రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
కర్ణాటక రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన


బెంగళూరు 08 జూన్ (హి.స.)

కర్ణాటక నుంచి రాబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ (BJP) అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక నుండి ప్రొఫెసర్ డాక్టర్ ఎం. నాగరాజను, మధ్యప్రదేశ్ నుండి మహేష్ కేవత్ను పార్టీ అభ్యర్థులుగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) ఖరారు చేసింది.కర్ణాటకలోని నాలుగు ఖాళీ స్థానాలకు గానూ ఒక స్థానానికి ప్రొఫెసర్ డాక్టర్ ఎం. నాగరాజను బీజేపీ బరిలోకి దించింది. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారిలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కూడా ఉండగా, ఈ స్థానానికి బీజేపీ స్వంత అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన పార్లమెంటరీ ప్రస్థానానికి ముగింపు పడినట్లయింది. రాజ్యసభ అభ్యర్థితో పాటు కర్ణాటక శాసనమండలి (MLC) ఎన్నికల కోసం లింగరాజ్ పాటిల్, రఘు కౌటిల్య పేర్లను కూడా పార్టీ ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande