పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold


ముంబై, 18 జూలై (హి.స.)పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ ఆభరణాల ధరలు శుక్రవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకంతో బంగారం, వెండి ధరలు మార్పుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత అంటే శనివారం ఉదయం 6గంటలకు దేశీయ మార్కెట్లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,520గా వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,640 వద్ద స్థిరపడింంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,520, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,30,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,670, 22 క్యారెట్ల ధర రూ.1,30,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande