దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు..
దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు..
స్టాక్ మార్కెట్


ముంబై, 17 జూలై (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల నుంచి

ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాటి సెషన్లో అద్భుతమైన రీబౌండ్ను ప్రదర్శించాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లతో లాభపడటంతో సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా ఎగబాకింది, నిఫ్టీ 24,300 ఎగువన స్థిరపడింది. శుక్రవారం ఉదయం 77,370.77 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో 78,282.55 పాయింట్ల గరిష్ఠానికి చేరి, చివరికి 964.58 పాయింట్ల భారీ లాభంతో 78,151.45 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనిస్తూ 261.55 పాయింట్ల లాభంతో 24,334.30 వద్ద నిలకడగా ముగిసింది. మరోవైపు సన్ ఫార్మా, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండిగో షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఇక అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 96.28 వద్ద సెటిల్ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande