స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే.?
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే.?
gold


ముంబై, 15 జూలై (హి.స.) గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు(బుధవారం) భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,570 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,31,600 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,06,670 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

బుధవారం జులై 15, పలు వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,42,790 గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి.. రూ.1,30,890 గా ఉంది.

హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,30,890 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,940, 22 క్యారెట్ల ధర రూ.1,31,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల ధర రూ.1,30,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande