
ముంబై, 14 జూలై (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock
markets) మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. హార్మోజ్ జలసంధిలో పెరుగుతున్న దాడులు, పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా మంగళవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. కానీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. దీంతో మధ్యాహ్నం మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 561 పాయింట్ల లాభంతో 77,054 వద్ద స్థిరపడింది.
మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా 158 పాయింట్లు పుంజుకు 24,000 మార్కును అధిగమించి 24,052 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్ఎఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లు మార్కెట్ను లాభాల వైపు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో మార్కెట్లు ఈ స్థాయి లాభాలను మూటగట్టుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు