భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
stock-market


ముంబై, 13 జూలై (హి.స.)పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు మదుపర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్-అమెరికా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 79 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.74గా ఉంది (Indian stock market).

గత సెషన్ ముగింపు (77,569)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 77,224 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 98 పాయింట్ల నష్టంతో 24,108 వద్ద కదలాడుతోంది (stock market news today).

సెన్సెక్స్, నిఫ్టీలో కల్యాణ్ జువెల్లర్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టీసీఎస్, యూనియన్ బ్యాంక్, భెల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఐసీఐసీఐ లాంబార్డ్, ఎంజెల్ వన్, భారత్ డైనమిక్స్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ, అవెన్యూ సూపర్ మార్కెట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 208 పాయింట్ల నష్టంతో ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande