మరింత తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..
Gold


ముంబై, 14 జూలై (హి.స.)ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు మరింత తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 80 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,800 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,30,900 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,07,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటే ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు తారుమారు అవుతున్నాయి. యుద్దం క్రమంలో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడంతో గోల్డ్ రేట్లు కుప్పకూలుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పడిపోగా.. ఇండియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,900గా ఉంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.540 తగ్గాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,31,500గా ఉండగా.. నేడు రూ.500 పడిపోయింది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,800గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,900 వద్ద కొనసాగుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,950గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,050 వద్ద కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande