మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
gold


ముంబై, 17 జూలై (హి.స.)బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నాారా.. ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. గోల్డ్ రేట్లు మళ్లీ పడిపోతున్నాయి. శుక్రవారం మరోసారి కుప్పకూలాయి. గంటల వ్యవధిలోనే ధరలు తారుమారు అయ్యాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,530 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 మేర పడిపోయాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,30,650గా ఉండగా.. నేడు రూ.700 తగ్గింది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,530గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,650 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,680 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,800 దగ్గర కొనసాగుతున్నాయి. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,24,900 పలుకుతోంది. హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర రూ.2,39,900గా ఉండగా.. చెన్నైలో కూడా ఇదే ధర పలుకుతోంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2.30 లక్షల వద్ద ట్రేడవుతోంది. నిన్న రూ.2.35 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.5 వేలు తగ్గింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande