పసిడి ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు! నేడు ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు! నేడు ఎలా ఉన్నాయంటే..
gold


ముంబై, 19 జూలై (హి.స.)భారత్లో గత కొంతకాలంగా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఒక రోజు ధరలు పెరిగితే మరుసటి రోజు అంతకుమించి తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా గత వారం ధరలు ఏకంగా 3 శాతం మేర పడిపోయాయి. గల్ఫ్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ధరల పతనం మరింతకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు (జులై 19) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.1,43,290 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాముల ధర రూ.1,31,350 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,30,000 లు గా కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande