
ఢిల్లీ, 22 జూలై (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం.. పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగిస్తుండగా.. లోక్ సభ రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ ఘటనపై స్పందిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. లోక్ సభలో పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో లోక్ సభ మధ్యాహ్నం 2 రెండు గంటల వాయిదా పడింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన
లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మేము మూడు రోజులుగా చెబుతూనే ఉన్నాము. చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలని మొదటి రోజు నుంచే చెబుతున్నాము. చర్చ ఎప్పుడు జరగాలి, ఎంతసేపు జరగాలి, ఏ నిబంధనల ప్రకారం జరగాలి అనే విషయాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయించాలి. నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ దేశ యువత భవిష్యత్తు కోసం ఒక నిర్మాణాత్మక చర్చ జరగాలి - ప్రభుత్వం కోరుకుంటున్నది ఇదే. అని ఆయన తేల్చి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV