నిరసనలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఢిల్లీ పోలీస్ కమిషనర్కు డిటన్షన్ పవర్స్
నిరసనలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఢిల్లీ పోలీస్ కమిషనర్కు డిటన్షన్ పవర్స్
Delhi police


న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.)

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్

విద్యార్థుల నిరసనలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిషనరేట్కు డిటెన్షన్ పవర్స్ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎవరిని అయినా ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించే అధికారం ఉంటుంది. అక్టోబర్ 18 వరకు ఈ పవర్ వినియోగించుకోవచ్చని కేంద్రం విడుదల చేసిన గెజిట్లో పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్తో భారీగా అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

దీని ప్రకారం శాంతిభద్రతలకు లేదా ప్రజారవాణా, సేవల నిర్వహణకు ఆటంకం కలిగితే అదుపులోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజా భద్రత దృష్ట్యా నిర్భంధించే అధికారాలు అప్పగించడం అవసరమని లెఫ్టినెంట్ గవర్నర్ విశ్వసిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నీట్ విద్యార్థుల నిరసనకు రోజురోజుకు మద్దతు పెరుగున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులకు మద్దతులగా దేశంలోని పలు పార్టీల నాయకులతో పాటు, అన్ని రాష్ట్రాల విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారు. కేవలం ఢిల్లీ నుండి మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుండి వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande