
అమరావతి, 23 జూలై (హి.స.)
భారత సంతతికి చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కు కుమార్ నేతృత్వంలోని ఏవియేషన్ టెక్నాలజీ అంకుర సంస్థ యారో అనాలటిక్స్కు అమెరికాలో అవార్డు లభించింది. విమాన బోర్డింగ్ గేట్ల వద్ద, లగేజీ వివాదాలకు చెక్ పెట్టడం కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను రూపొందించినందుకు గాను.. టెక్సాస్ ఏఅండ్ఎం ఇన్నోవేషన్ నిర్వహించిన టెక్సాస్ ఏఅండ్ఎం న్యూవెంచర్స్ కాంపిటీషన్లో 11,000 డాలర్ల బహుమతిని ఈ అంకురం దక్కించుకుంది. అనుభవజ్ఞులైన వ్యవస్థాపకులు, అధ్యాపకులు, పరిశ్రమ పరిశోధకులతో పోటీపడిన అంకురాల్లో, కేవలం ఇద్దరే విద్యార్థులతో కూడినది ఇదీ. మొత్తం 125 దరఖాస్తుదార్లలో ఎలివేటర్ పిచ్ విభాగంలో యారో అనాలటిక్స్ నాలుగో స్థానంలో నిలిచింది.
బోర్డింగ్ గేట్ల వద్ద సీలింగ్కు అమర్చిన ఏఐ కెమేరాలను ఉపయోగించి, ప్రయాణికుల వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగేజీ, విమానంలోని ఓవర్హెడ్ బిన్ ఖాళీ స్థలాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా చివరి నిమిషంలో అనూహ్యంగా లగేజీని గేట్ వద్ద చెక్-ఇన్లోకి మార్చాల్సిన అవసరం పడదు. ‘కొత్త ఉత్పత్తి డిజైన్ చేసేందుకు, ఈ అవార్డు డబ్బు సహాయపడుతుంద’ని అక్కు కుమార్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ