
హైదరాబాద్, 23 జూలై (హి.స.) నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి (Parliament Sessions) ఈ క్రమంలోనే సభలో విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కలుగజేసుకుని ‘నీట్'పై చర్చిద్దామని చెప్పినా.. విపక్ష సభ్యులు పట్టించుకోకుండా ఆవేశంతో పోడియం వైవునకు దూసుకెళ్లారు. ఓ దశలో అధికార, విపక్షాల మధ్య పోటాపోటీ నినాదాలు సభలో హోరెత్తాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా లోక్సభను వాయిదా వేశారు. అయితే, అంతకు ముందు పార్లమెంట్ ఎంట్రెన్స్లోని 'మకర్ ద్వార్' వద్ద ఎన్డీఏ, ఇండియా కూటమి సభ్యులు తగ్గేదేలేదన్నట్లుగా ఆందోళనలు నిర్వహించారు. తమ తమ డిమాండ్లను వినిపిస్తూ ప్లకార్డును సైతం ప్రదర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..