ఆందోళనకారులను బొద్దింకలతో పోల్చిన అధికారిణి.. ఇన్స్టా పోస్ట్తో తీవ్ర వివాదం
ఆందోళనకారులను బొద్దింకలతో పోల్చిన అధికారిణి.. ఇన్స్టా పోస్ట్తో తీవ్ర వివాదం
ఆందోళనకారులను బొద్దింకలతో పోల్చిన అధికారిణి.. ఇన్స్టా పోస్ట్తో తీవ్ర వివాదం


హైదరాబాద్, 23 జూలై (హి.స.)

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) అధికారిణి సోనియా సెహ్రావత్ సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. నిరసనకారులను ఉద్దేశించి ఆమె 'బొద్దింకలు' అని సంబోధించడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం 'పార్లమెంట్ మార్చ్' నిర్వహించారు. ఈ నిరసనల క్రమంలో బందోబస్తు విధుల్లో ఉన్న సోనియా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చనిపోయిన బొద్దింక ఫొటోను షేర్ చేశారు. తమను తాము సరిదిద్దుకోలేరు కానీ, దేశాన్ని బాగుచేయాలని చూస్తున్నారు అంటూ దానికి ఒక వ్యాఖ్యను జతచేశారు.

సోనియా పోస్ట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆమె దానిని వెంటనే తొలగించారు. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) దీనిపై ఘాటుగా స్పందించింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని ఒక ఆర్ఏఎఫ్ అధికారిణి బొద్దింకలతో పోల్చడం దిగ్భ్రాంతికరం. అయినా మేం బొద్దింకలమే.. బొద్దింకలకు చావుండదు అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.

సర్వీస్ నిబంధనల ప్రకారం, విధుల్లో ఉన్న అధికారులు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదా యూనిఫాంలో ఉన్న ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంచడం నిషిద్ధం. అయితే సోనియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యూనిఫాంలో ఉన్న ఫొటోనే ప్రొఫైల్ పిక్చర్‌గా వినియోగించారు. హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచూ తన వ్యక్తిగత అభిరుచులకు సంబంధించిన బైక్ రైడింగ్, వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande