కాన్స్టిట్యూషన్ క్లబ్లో నేడు కేంద్ర ప్రభుత్వంతో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు
కాన్స్టిట్యూషన్ క్లబ్లో నేడు కేంద్ర ప్రభుత్వంతో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు
CJP PROTEST


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని 'కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా' (CCI) వేదికగా ఈరోజు (జూలై 24, శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి బృందం చర్చలు జరపనుంది. ప్రభుత్వ కార్యాలయాలు లేదా మంత్రుల నివాసాల్లో కాకుండా ఒక తటస్థ వేదికపైనే (Neutral Venue) తాము చర్చలకు వస్తామని CJP పెట్టిన నిబంధనకు కేంద్రం అంగీకరించడంతో ఈ భేటీ ఖరారైంది. జూలై 20న కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన గత రౌండ్ చర్చల సమయంలో తమను గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించిన CJP నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. భవిష్యత్తు చర్చలన్నీ తటస్థ వేదికలపైనే జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బహిరంగ మనస్సుతో వచ్చి విద్యార్థుల సమస్యలను వింటుందని ఆశిస్తున్నట్లు CJP ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని, నిరసనకారులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలనే తమ ప్రధాన డిమాండ్లపై ఎలాంటి రాజీ పడేది లేదని, జంతర్ మంతర్ వద్ద ధర్నా కొనసాగుతుందని సంస్థ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande