
హైదరాబాద్, 24 జూలై (హి.స.)
నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదో రోజైన ఈరోజు (జూలై 24, శుక్రవారం) కూడా ఉభయ సభలలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని మరియు ఈ అంశంపై సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష 'ఇండియా' (INDIA) కూటమి సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలలో భారీగా నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగించారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు, సభలో నెలకొన్న డెడ్‌లాక్‌ను వీడదీసేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలేలతో భేటీ అయ్యారు; ఈ చర్చల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. కాగా, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధానికి గట్టి సందేశమిస్తూ.. ప్రధాని మోదీ ఈరోజు పార్లమెంట్‌కు వచ్చే ముందే ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, క్షమాపణ చెప్పిన తర్వాతే తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi