
న్యూఢిల్లీ, 26 జూలై (హి.స.)
నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన
అవకతవకల ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం వద్ద అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నీట్ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు, భద్రతా దళాలు ఆయన నివాసం చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లే రహదారుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, అటుగా వచ్చేపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..