
హైదరాబాద్, 27 జూలై (హి.స.)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ఉదయానికి పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా సమీపంలో కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశలో కదులుతూ.. ఒడిశా తీరం బాలాసోర్ కు తూర్పు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్ లోని డిగాకు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాయుగుండం నేడు బాలాసోర్ - క్యానింగ్ మధ్య తీరం దాటే ఛాన్సున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒడిశా అంతటా.. ఉత్తరకోస్తాలోని ఒకట్రెండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుందన్నారు. ఒడిశా - ఆంధ్రా తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా.. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతా ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు