
న్యూఢిల్లీ, 27 జూలై (హి.స.)
మత మార్పిడితో SC హోదా
కోల్పోతారని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని మార్చి 2026లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా ఉండదని తేల్చి చెప్పింది. ఇతర మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, ఎస్సీ హోదా పునరుద్ధరణకు 3 షరతులు తప్పనిసరి అని పేర్కొంది.
ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలను లేదా సర్టిఫికేట్ను పొందడం చెల్లదని, మత మార్పిడితో ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉందంటూ, రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు