ఇక్కడ అంతర్జాతీయం.. అక్కడ భారతీయం
మన దేశానికి తరలి వస్తున్న విదేశీ విశ్వవిద్యాలయాలు పలు దేశాల్లో ఐఐటీ, ఐఐఎంల ప్రాంగణాలు.
Students


హైదరాబాద్, 26 జూలై (హి.స.)భారతీయ యువత విదేశీ విద్య కోసం అధిక సంఖ్యలో తరలివెళ్తున్న నేపథ్యంలో వారిని నిలువరించేందుకు విదేశీ వర్సిటీలను ఇక్కడికి రప్పిస్తుండగా.. ప్రతిష్ఠాత్మక భారతీయ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలు పలు దేశాల్లో క్యాంపస్లను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ వంటి దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లను ప్రారంభిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు గల్ఫ్, ఆఫ్రికా ఖండంతోపాటు ఆసియాలోని పలు దేశాల్లో ప్రాంగణాలను నెలకొల్పుతున్నాయి.

ఐఐటీలు, ఐఐఎంలు అక్కడ..

ప్రపంచవ్యాప్తంగా మన ఐఐటీలు, ఐఐఎంలకు మంచి పేరుంది. అందుకే ప్రాంగణాలను ప్రారంభించాలని పలు దేశాలు భారత్ను కోరాయి. ఈ మేరకు 2023-24 నుంచి ఐఐటీ మద్రాస్ టాంజానియా(ఆఫ్రికా)లోని జాంజిబార్ క్యాంపస్లో తరగతులు ప్రారంభించింది. 2024-25లో ఐఐటీ దిల్లీ యూఏఈలోని అబుధాబీలో.. 2025-26లో ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్లో ప్రాంగణాలను నెలకొల్పాయి. ఐఐటీ బెంగళూరు కూడా ఇండోనేసియాలో క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఐఐటీ మద్రాస్ శ్రీలంకలోనూ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే భూటాన్, మొరాకో, నైజీరియా దేశాల నుంచి వినతులు రావడంతో కేంద్రం వాటిని పరిశీలిస్తోంది. ‘‘టెక్నాలజీకి ఐఐటీలు, మేనేజ్మెంట్ విద్యకు ఐఐఎంలకు ప్రపంచవ్యాప్తంగా పేరుండటంతో ఆ రంగాల్లో వెనుకబడిన పలు దేశాలు మన క్యాంపస్లను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి’’ అని ఐఐఈఎస్టీ షిబ్పూర్ డైరెక్టర్ ఆచార్య వీఎంవీఆర్ మూర్తి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande