
జనగామ, 27 జూలై (హి.స.)
దేశ వ్యాప్తంగా గల సమస్త సాధుసంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంఘాల నాయకులు, గో భక్తులు కలిసి గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో.. దేశీయ గో సంపద రక్షణ, సమృద్ధి కోసం ఒకే రోజున యావత్ దేశవ్యాప్తంగా 5కోట్లకు పైగా సంతకాలతో సుమారు పదివేలకు పైగా తహసిల్ మరియు కలెక్టర్ కార్యాలయాల్లో, గవర్నర్ మరియు కేంద్రప్రభుత్వానికి, ప్రధాని, రాష్ట్రపతులకు వినతిపత్ర సమర్పణ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. లీగల్ బేసిస్, హంబుల్ అప్పీల్, సిగ్నేచర్ లిస్ట్ డాటా ఐదున్నర కోట్ల సంతకాల షీట్లు, డ్రైవ్లు సమర్పించింది..
అందులో భాగంగా జనగామ జిల్లాలో హిందూ సంఘాల నాయకులు, గో ప్రేమికులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ నాయకులు, సంస్థ ప్రతినిధులు ఎనగందుల బిక్షపతి, డాక్టర్ మోహనకృష్ణ భార్గవ, పాశం శ్రీశైలం, అంబటి బాలరాజు, చిలువేరు హర్షవర్ధన్, మాసరాజు, బత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..