
న్యూఢిల్లీ, 26 జూలై (హి.స.)
భారత పౌరులకు తాజాగా విదేశాంగ
శాఖ కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. నల్లసముద్రం (Black Sea)తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధం, ఘర్షణల నేపథ్యంలో అక్కడ ప్రయాణించే పౌరులు, పనిచేసే వ్యాపార నౌకలు (Commercial Vessels) ລ້ స్పష్టం చేసింది. అయితే, తాజాగా నల్ల సముద్రంలో ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల నుంచి ఈ తరహా దాడుల తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ దురదృష్టకర ఘటనల్లో ఇప్పటి వరకు ఐదుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశాంగ శాఖ వెల్లడించింది.
'బ్లాక్ సీ' ప్రాంతంలో నడిచే నౌకల్లో ఉద్యోగాలు పొందాలనుకునే భారతీయ నావికులు అక్కడ ఉండే ప్రమాదాలను క్షుణ్ణంగా అంచనా వేసుకోవాలని సూచించింది. భద్రతా ఏర్పాట్లు, ఇన్సూరెన్స్ పరిహారం, అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, ఉద్యోగ నియమ నిబంధనలను ముందే క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని స్పష్టం చేసింది. నౌకలపై ఉన్న భారతీయులు తమ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని, ఓడ యాజమాన్యం ఇచ్చే భద్రతా ఆదేశాలను తప్పక పాటించాలని, అదేవిధంగా భారత విదేశాంగ శాఖ జారీ చేసే హెచ్చరికలను నిశితంగా గమనిస్తూ ఉండాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..