
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఆదివారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆమె స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో, వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు ఆమె మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi