హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షాలు: పలు ప్రాంతాల్లో జలమయం, రాగల 24 గంటల్లో మరిన్ని జిల్లాలకు హెచ్చరిక!
హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షాలు: పలు ప్రాంతాల్లో జలమయం, రాగల 24 గంటల్లో మరిన్ని జిల్లాలకు హెచ్చరిక!
rain


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరపాలక సంస్థ (GHMC) సిబ్బంది రంగంలోకి దిగి డ్రైనేజీలను క్లియర్ చేస్తూ నీటి నిల్వలను తొలగించే చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande