తెలంగాణలో రైతు రుణమాఫీ మూడో విడతకు సర్కారు ముమ్మర కసరత్తు.. నిధుల విడుదలకు అంతా సిద్ధం!
తెలంగాణలో రైతు రుణమాఫీ మూడో విడతకు సర్కారు ముమ్మర కసరత్తు.. నిధుల విడుదలకు అంతా సిద్ధం!
farmer


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

హైదరాబాద్:తెలంగాణలో రెండు విడతల రైతు రుణమాఫీ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, చివరిదైన మూడో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. రెండు లక్షల రూపాయల వరకు బ్యాంక్ రుణాలు ఉన్న మిగిలిన రైతులందరికీ ఈ విడతలో రుణ విముక్తి కల్పించేందుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొదటి రెండు విడతల్లో ఆధార్ కార్డు తప్పులు, సాంకేతిక లోపాలు లేదా రేషన్ కార్డు అనుసంధానం కాకపోవడం వంటి వివిధ కారణాల వల్ల నిధులు జమకాని రైతుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నారు.ఆగస్టు మొదటి వారంలోగా అర్హులైన రైతులందరి ఖాతాల్లోని సాంకేతిక లోపాలను పూర్తిగా సరిదిద్ది, నిధులను నేరుగా జమ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడో విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన లక్షలాది మంది రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానిక వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భారీ రుణమాఫీ ప్రక్రియను గడువులోగా వంద శాతం పూర్తి చేసి రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande