దేశవ్యాప్తంగా జనాభా విధానం, యూసీసీని అమలు చేయాలి: రాష్ట్రీయ సేవికా సమితి డిమాండ్
దేశవ్యాప్తంగా జనాభా విధానం, యూసీసీని అమలు చేయాలి: రాష్ట్రీయ సేవికా సమితి డిమాండ్
samiti


హైదరాబాద్, 27 జూలై (హి.స.)

దేశంలో పెరుగుతున్న జనాభా అసమతుల్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని వర్గాలకు వర్తించేలా ఒకే రకమైన జనాభా విధానాన్ని (Uniform Population Policy) మరియు ఉమ్మడి పౌర స్మృతిని (UCC) దేశవ్యాప్తంగా తక్షణమే అమలు చేయాలని రాష్ట్రీయ సేవికా సమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. హర్యానాలోని సమల్ఖాలో జరిగిన ఈ మహిళా స్వచ్ఛంద సంస్థ యొక్క మూడు రోజుల అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశాల ముగింపు రోజున ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 1951లో 84.68 శాతంగా ఉన్న హిందూ జనాభా వాటా 2015 నాటికి 78 శాతానికి తగ్గిందని, ఇదే కాలంలో ముస్లిం జనాభా 10 శాతం కంటే తక్కువ నుండి 14 శాతానికి పెరిగిందని సమితి ఆ తీర్మానంలో పేర్కొంది. రోహింగ్యాలు, బంగ్లాదేశీల అక్రమ వలసలు, మతమార్పిడులు మరియు లవ్ జిహాద్ వంటి అంశాలు ఈ జనాభా అసమతుల్యతకు కారణమవుతున్నాయని, దీనివల్ల స్థానిక సంస్కృతి, ఉపాధి, సహజ వనరులపై ఒత్తిడి పెరిగి దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకున్న హిందూ యువత ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, పిల్లలను వద్దనుకోవడం లేదా ఒక్కరికే పరిమితం కావడం వల్ల కూడా హిందూ జనాభా తగ్గుతోందని సమితి ప్రముఖ సంచాలిక శాంతకుమారి పేర్కొన్నారు. 1936లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,886 శాఖలతో విస్తరించిందని, సంస్థ 90 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువత ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించామని ప్రతినిధులు వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande