రాయల్.ఎన్ఫీల్డ్ మోటార్..సైకిళ్ల.తయారీ ఐషర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్ తడ లో.కొత్తగా ప్లాంట్ ఏర్పాటు
రాయల్.ఎన్ఫీల్డ్ మోటార్..సైకిళ్ల.తయారీ ఐషర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్ తడ లో.కొత్తగా ప్లాంట్ ఏర్పాటు
royal


అమరావతి, 30 జూలై (హి.స.)

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్, ఆంధ్రప్రదేశ్లోని తడలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంటు కోసం తొలిదశలో రూ.1,225 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు జూన్ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ప్రకటించింది. మోటార్సైకిళ్ల ఉత్పత్తి పెంచేందుకు దశలవారీగా మొత్తం రూ.2,500 కోట్లు వెచ్చించాలన్నది సంస్థ ప్రణాళిక. ఈ ప్లాంటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఏడాదికి అదనంగా 4.5 లక్షల మోటార్సైకిళ్లు తయారు చేయొచ్చు. 2029-30 కల్లా ఈ ప్లాంటు పూర్తవుతుందని సంస్థ పేర్కొంది.

21% పెరిగిన లాభం:ఐషర్ మోటార్స్, జూన్ త్రైమాసికంలో రూ.1,462.51 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ఆర్జించింది. 2025-26 ఇదే త్రైమాసిక లాభం రూ.1,205.22 కోట్ల కంటే ఇది 21.4% ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5,041.84 కోట్ల నుంచి రూ.6,632.42 కోట్లకు పెరిగింది. వ్యయాలు కూడా రూ.4,052.02 కోట్ల నుంచి రూ.5,341 కోట్లకు చేరాయి. కంపెనీ ద్విచక్ర వాహన విభాగమైన రాయల్ ఎన్ఫీల్డ్ సమీక్షా త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 3,32,940 వాహనాలు విక్రయించింది. 2025-26 ఇదే త్రైమాసికంలో అమ్మిన 2,61,326 బైక్ల కంటే ఇవి 27% అధికం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande