సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలి.. కరీంనగర్ సిపి
సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలి.. కరీంనగర్ సిపి
Cp


కరీంనగర్, 30 జూలై (హి.స)

సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బంది పట్టు

సాధించాలి అని సీపీ గౌష్ ఆలం సూచించారు. కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గంగాధర పోలీస్ స్టేషన్ను గురువారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ వార్షిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు విచ్చేసిన సీపీకి గంగాధర ఎస్సై వంశీకృష్ణ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనాన్ని కమిషనర్ స్వీకరించారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన సీపీ, ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు, రికార్డుల నిర్వహణను తనిఖీ చేసి సీసీటీఎన్ఎస్ లో వివరాల నమోదు పక్కాగా ఉండాలని సూచించారు. తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన సీసీటీఎన్ఎస్ - 2.0, ఈ-సమన్లు, టీఎస్-కాప్, హెచ్ఎర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్, దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ సాఫ్ట్వేర్, సీడీఆర్ వంటి అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి పట్టు సాధించి రోజువారీ విధుల్లో ఉపయోగించాలన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ఉపయోగిస్తున్న తీరును పరిశీలించారు.

ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్ను పరిశీలించిన సీపీ, పెండింగ్ కేసుల దర్యాప్తు ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదైన సైబర్ నేరాల వివరాలు తెలుసుకుంటూ, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీసు అధికారులను కేటాయించాలని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారి నూతన సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande