
కర్నూలు, 30 జూలై (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీలోని పోలవరం, తూగో, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, పగో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు
తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు దంచి కొట్టనున్నాయి. మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్ మహానగరంలో కూడా ఇవాళ గ్యాప్ లేకుండా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రజలు బయటకు రాకూడదని సూచనలు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV